ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.. వాస్తు శాస్త్రంలో ఏ వస్తువు ఎక్కడ ఉండాలి. ఏ దిక్కున గదిని లా వాడుకోవాలో పండితులు చాలా చక్కగా వివరించారు. చెప్పులు పెట్టేందుకు కూడా వాస్తు ఉంటుందా.. ఇంట్లో షాపు ఉంటే గోడౌన్ గా ఏ దిక్కను రూంను ఉపయోగించాలి .. మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు ఏమంటున్నారో చూద్దాం...
ప్రశ్న: ఈ మధ్యే కిరాణా దుకాణం పెట్టాను. మొత్తం నాలుగు గదులున్నాయి. మొదటి రెండు గదులకు షెట్టర్లు ఉన్నాయి. ఈ రెండు దక్షిణ ముఖంగా ఉన్నాయి. వాటి మధ్య ఉన్న గోడను తొలగించి దుకాణం పెట్టాం. వాటికి ఆనుకుని వెనక మరో రెండు గదులు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని గోదాంలా వాడాలనుకుంటున్నాం. ఏ వైపు రూంని గోదాంలా వాడితే బాగుంటుంది.
జవాబు: దక్షిణ-నైరుతి వైపు ఉన్న గదిని గోదాంగా వాడుకోవచ్చు. మరో గదిని ఇతర అవసరాల కోసం వాడుకోవడం మంచిది.
ప్రశ్న: మేం చాలా రోజుల నుంచి మంచం కింద బూట్లు, చెప్పులు విడుస్తున్నాం. ఈ మధ్య మా ఇంటికి ఒక పెద్దాయన వచ్చినప్పుడు అలా విడవడం తప్పు. అది వాస్తు దోషమవుతుందని చెప్పారు. చెప్పులు విడవడంలో కూడా వాస్తు ఉంటుందా?
జవాబు:అది వాస్తుదోషమైతే కాదు. కానీ... అలా విడవడం అంత మంచిది కాదు. బయటికెళ్లి వచ్చినప్పుడు బ్యాక్టీరియా, వైరస్ లు చెప్పులతోపాటు వస్తాయి. కాబట్టి ఇంటి బయటే వదిలేసి లోపలికి వెళ్తే మంచిది.
